స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో17661కి చేరినా..వెంటనే 17626ని తాకింది. ఇపుడు 17650 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 9 పాయింట్ల నష్టంతో ఉంది. ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నమాటే గాని… లాభాలన్నీ పరిమితంగా ఉన్నాయి. నిఫ్టిలో 22 షేర్లు లాభాల్లో ఉండగా, 27 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో ఓఎన్జీసీ టాప్ గెయినర్ కాగా, అపోలో హాస్పిటల్ టాప్ లూజర్‌గా నిలిచింది. అపోలో హాస్పిటల్ ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండటమే దీనికి కారణం. హైదరబాద్‌కు చెందిన రెయిన్బో హాస్పిటల్ ఓపెనింగ్‌లో రూ. 587ని తాకినా.. ఇపుడు రూ.578 వద్ద ట్రేడవుతోంది. అలాగే బాటా ఇండియా ఫలితాల కారణంగా షేర్ రూ. 1921 వద్ద ట్రేడవుతోంది. తాజాగా లిస్టయిన మెట్రో బ్రాండ్స్ ఇవాళ ఓపెనింగ్‌లో రూ. 844ని తాకింది. అయితే ఇపుడు రూ. 832 వద్ద ట్రేడవుతోంది. పేటీఎం షేర్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేయడంతో షేర్ రూ. 34 తగ్గి రూ. 791 వద్ద ట్రేడవుతోంది. ఐఆర్సీటీసీ ఇవాళ కూడా రూ. 15 లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. దివీస్ ల్యాబ్ రూ. 42 నష్టంతో ట్రేడవుతోంది.