స్థిరంగా ప్రారంభం
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌ల 17422ని తాకినా ఇపుడు17365 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.క్రితం ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇతర ప్రధాన సూచీలు కూడా దాదాపు క్రితం స్థాయి వద్దే ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్ మాత్రం అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఫైనాన్షియల్స్ కూడా ఇలాగే ఉంది. దీనికి ప్రధాన కారణంగా ఎస్బీఐ ఫలితాలు. ఎస్బీఐ సుమారు 3 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌లో 3 షేర్లు గ్రీన్‌లో..9 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మెటల్స్, రిలయన్స్ ఇవాళ లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో రెండు శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది. ఎస్బీఐ, బీపీసీఎల్ కోలుకునే పక్షంలో నిఫ్టి గ్రీన్‌లోకి రావొచ్చు.