నిఫ్టి స్థిరంగా ప్రారంభం
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16500 స్థాయిని దాటింది. ఓపెనింగ్‌లో16457ని తాకిన నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించింది. ఇపుడు నిఫ్టి 16500 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 17 పాయింట్ల లాభంతో ఉంది. ఇతర సూచీలన్నీ స్థిరంగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో ప్రిఫరెన్స్ షేర్లను కేటాయించే ప్రతిపాదనను పరిశీలించనుంది. మరి ఒరిజనల్ ప్రమోటర్లకు అదనంగా షేర్లు కేటాయిస్తారా? లేదా కొత్త ఇన్వెస్టర్‌కు కేటాయిస్తారా? అన్నది చూడాలి. కంపెనీ ప్రస్తుతానికి జొమాటో అమ్మకాలు ఇప్పటికైతే ఆగాయి. ఫలితాలు బాగుండటంతో ఎల్ అండ్ టీ షేర్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. చాలా వరకు ఐటీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టిలో టాప్ లూజర్ అపోలో హాస్పిటల్స్. కొటక్ బ్యాంక్‌లో ఇవాళ కూడా అమ్మకాల ఒత్తిడి ఉంది. మెక్ డొవెల్ షేర్ మూడున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది.