For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 16,900 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 16888ని తాకినా… వెంటనే కోలుకుని ఇపుడు 16915 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 44 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ కూడా నిఫ్టి బ్యాంక్‌ 0.64 శాతంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. క్రూడ్‌ ధరలు తగ్గడంతో ఓఎన్‌జీసీ షేర్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. అలాగే ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే అన్ని మెటల్‌, మైనింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. పేటీఎం కంపెనీ వివరణ ఇచ్చినా షేర్‌ ధరలో పెద్ద మార్పు లేదు. హ్యాపియస్ట్‌ మైండ్స్‌ నిన్న పది శాతం పెరగ్గా, ఇవాళ అయిదు శాతం పెరిగింది. ఇవాళ రియల్‌ ఎస్టేట్‌ షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. బ్యాంక్‌ షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ షేర్‌ మినహా మిగిలిన నిఫ్టి బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.