17,950 దిగువన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి అనుగుణంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి తొలి మద్దతు స్థాయి 17,950ని తాకింది. 17,932ను తాకిన తరవాత 68 పాయింట్ల నష్టంతో 17,948 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 35 షేర్లు నష్టాలతో ఉన్నాయి. అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నాయి. అధికంగా 0.5 శాతం నష్టంతో బ్యాంక్ నిఫ్టి ట్రేడవుతోంది. మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు మాత్రం గ్రీన్ ఉన్నాయి. ఫలితాలతో పాటు ఇతర కంపెనీ పెట్టుబడి పెట్టాలన్న జొమాటో నిర్ణయానికి మార్కెట్ పాజిటివ్‌గా స్పందించింది. ఇవాళ నాలుగు శాతం లాభంతో ఈ షేర్ ట్రేడవుతోంది. నిఫ్టి టాప్ గెయినర్స్ టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ ఉండటం విశేషం. మిడ్ క్యాప్‌లో టాటా పవర్ టాప్ గెయినర్‌గా ఉంది.