For Money

Business News

17300 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17273 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17298 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 33 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 33 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నష్టాలు నామమాత్రంగా ఉండటంతో సూచీల్లో పెద్ద మార్పు కన్పించడం లేదు. ఇతర సూచీలు కూడానష్టాల్లో ఉన్నాయి. అయితే అన్నింటికన్నా అధికంగా బ్యాంక్‌ నిఫ్టి అరశాతంపైగా నష్టపోయింది.అయితే నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మాత్రం గ్రీన్‌లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ రెడ్‌లో ఉన్నా.. చాలా నామమాత్రపు నష్టంతో ఉన్నాయి. ఇటీవల బాగా పెరిగిన మిడ్‌ క్యాప్‌ బ్యాంకు షేర్లలో ఒత్తిడి వస్తోంది. తమ వ్యాపారం బాగుందని, ఫలితాలు బాగుంటాయని సంకేతాలు ఇవ్వడంతో టైటాన్‌ షేర్‌ 5 శాతం దాకా లాభపడింది. అలాగే హీరో మోటో కార్ప్‌ 1.3 శాతంతో లాభంలో ఉంది. మిగిలిన షేర్లలో నామ మాత్రపు లాభాలే కన్పిస్తున్నాయి. ఇక హిందాల్కో నిఫ్టి నష్టాల్లో ముందుంది. ఈ షేర్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. గల్ఫ్‌ మార్కెట్‌లో విస్తరించేందుకు అపెల్స్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకోవడంతో నైకా షేర్‌ రెండు శాతం లాభపడింది. ఫార్మా షేర్లలో కొన్ని ఎంపిక చేసిన షేర్లలో మద్దతు లభిస్తోంది. లారస్‌ ల్యాబ్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. బ్యాంక్‌ నిఫ్టిలో అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి.