17200 దిగువన నిఫ్టి
ఆరంభంలోనే నిఫ్టి 17200 దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం 17203 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 186 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి 1.26 శాతం నష్టపోయింది. నిఫ్టి ఫైనాన్షియల్ కూడా 1.35 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ నిఫ్టి అర శాతం నష్టానికి పరిమితమయ్యాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన హెచ్‌సీఎల్ టెక్‌తో పాటు ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాభాల్లో ఉన్నాయి. ఇవాళ హిందాల్కో నిఫ్టి లూజర్స్‌లో టాప్‌లో ఉంది. నిఫ్టి ప్రధాన మద్దతు స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయిలో నిలబడితే నిఫ్టి కోలుకునే అవకాశాలు ఉన్నాయని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు.