ఓపెనింగ్‌లోనే 16,300పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే దాదాపు 40 పాయింట్ల లాభంతో ప్రారంభమై 16,246ని తాకింది. కాని కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 16,303 పాయింట్లను తాకింది. బ్యాంక్ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ మాత్రం 0.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి ప్రస్తుతం 64 పాయింట్ల లాభంతో 16,302 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడటంతో ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ఉన్నా సూచీ ఒక మోస్తరు లాభాలకే పరిమితమైంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టెక్ మహీంద్రా 1,293.65 2.30
హెచ్‌సీఎల్ టెక్ 1,064.80 1.41
ఇన్ఫోసిస్ 1,666.50 0.99
విప్రో 603.80 0.97
అల్ట్రాటెక్ సిమెంట్ 7,597.00 0.92
నిఫ్టి టాప్ లూజర్స్
ఓఎన్జీసీ 115.60 -0.90 హిందాల్కో 438.40 -0.85
టాటా కన్జూమర్ 778.15 -0.41
రిలయన్స్ 2,083.10 -0.28
బజాజ్ ఫిన్ సర్వ్ 6,207.10 -0.28