ఫలితాలు దెబ్బ తీసినా…
గత వారాంతంలో వచ్చిన ఆర్థిక ఫలితాలకు మార్కెట్ స్పందించింది. ముఖ్యంగా రిలయన్స్ ఫలితాలను నిఫ్టిని బాగా దెబ్బతీశాయి. రిలయన్స్ ప్రభావం పక్కన బెడితే నిఫ్టి లాభాల్లో ఉన్నట్లే. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16649 పాయింట్లకు అంటే ఇవాళ్టి కీలక స్థాయికి చేరి వెంటనే 16701కి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 18 పాయింట్ల నష్టంతో ఉంది. గత వారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్స్‌లో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అపోలో హాస్పిటల్స్ ఉంది. ఫలితాలు బాగా లేనందున కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి నామమాత్రపు నష్టాల్లో ఉన్నా.. మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి అరశాతంపైగా లాభంతో ఉంది. దాదాపు ప్రధాన బ్యాంకులన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 26 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి వెంటనే గ్రీన్‌లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.