18600పైన నిఫ్టి

ఆసియా మార్కెట్ల ఉత్సాహం, కార్పొరేట్ ఫలితాల కారణంగా నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18,600ని దాటి 18,604ని తాకింది. పొజిషనల్ ట్రేడర్స్‌కు మరో జాక్ పాట్. కాని అదే సమయంలో షార్ట్ ట్రేడర్స్‌కు కూడా మంచి లాభాలు అందాయి. ఎందుకంటే ఓపెనింగ్ తరవాత కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 18,534ని తాకింది.అంటే ఓపెనింగ్‌లో అంటే 18600పైన షార్ట్ చేసినవారికి 70 పాయింట్ల లాభం. ఇవాళ్టికి డే ట్రేడర్స్ కావాల్సిన ఆదాయం వచ్చేసినట్లే. నిఫ్టి ఇక్కడి నుంచి ఏ స్థాయిలో కొనసాగుతుందనేది కీలకంగా మారింది. నిఫ్టికి ఇవాళ్టికి 18,570 కీలక స్థాయి కానుంది. ఈ స్థాయికి దిగువకు వస్తే బలహీనం కావొచ్చు. నిఫ్టి 18600ని దాటితే అమ్మకానికి ఛాన్స్‌గా భావించవచ్చు. ఈసారి కూడా స్వల్ప లాభాలతో బయటపడండి. నిఫ్టిలో 39 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.