18300పైన నిఫ్టి.. కాని
ఆరంభంలోనే నిఫ్టి 18318ని తాకింది. కాని వెంటనే అక్కడ వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నేరుగా 18243కి క్షీణించింది. ఇపుడు నిఫ్టి 18253 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇపుడు 54 పాయింట్ల లాభంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్లో ఉన్నాయి. కాని సూచీలు ఒక మోస్తరు లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ఉత్సాహం కన్పించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటం. నిఫ్టి 18300 కాల్ రైటింగ్ చాలా జోరుగా ఉండటంతో ఈ స్థాయిని దాటడం నిఫ్టికి చాలా కష్టంగా కన్పిస్తోంది. మరి పదింటకల్లా ఓపెన్ ఇంటరెస్ట్ తగ్గుతుందేమో చూడాలి. నిన్నటి మాదిరి ఇవాళ కూడా చాలా వరకు ఫార్మా షేర్లు గ్రీన్లో ఉన్నాయి. కొన్ని ఐటీ షేర్లకు కూడా మద్దతు లభిస్తోంది. మిడ్ క్యాప్ ఫార్మా, ఐటీ షేర్లలలో ఆసక్తి కన్పిస్తోంది.