18,300పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి 18300పైన ప్రారంభమైంది. 18,322ని తాకిన నిఫ్టి ఇపుడు 44 పాయింట్ల లాభంతో 18,312 వద్ద ట్రేడవుతోంది. డే ట్రేడింగ్‌లో నిఫ్టికి తొలి ప్రతిఘటన 18326, రెండో ప్రతిఘటన 18,384 ప్రాంతంలో ఎదురు కానుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి తొలి ప్రతిఘటన వద్దే ఆగిపోవచ్చు. ఇక్కడే అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఇక షేర్ల విషయానికొస్తే ఏషియన్ పెయింట్ దాదాపు 15 శాతం క్షీణించిన తరవాత ఇవాళ 3.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగినా…గత త్రైమాసికంతో పోలిస్తే పెద్ద మార్పు లేదు. దీంతో ఈ షేర్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఈ షేర్ మూడు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టిలో కాస్త ఉత్సాహం కన్పించినా.. బ్యాంకులు మాత్రం ఇవాళ కూడా నిరాశపర్చాయి. ఇక నిఫ్టి నెక్ట్స్, మిడ్‌క్యాప్ పరవాలేదు.