18100పైన నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టి స్థాయి లాభాలతోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 18130ని తాకి ఇపుడు 18104 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 92 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 5 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్ ఇవాళ కూడా లాభాల్లో ఉన్నాయి. ఫలితాలు దారుణంగా ఉన్నందున టాటా స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్ షేర్‌లో కూడా పెద్ద మార్పులేదు. యాక్సిస్ బ్యాంక్‌లో ఇవాళ భారీ బ్లాక్‌డీల్ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్ తన వాటాలో కొంత భాగాన్ని అమ్ముకున్నారు. దీంతో ఈ షేర్ ఒక శాతంపైగా నష్టపోయింది. పనితీరు బాగున్నందున ఈక్విటాస్ బ్యాంక్ మూడు శాతంపైగా లాభపడింది. బోనస్ ప్రకటన తరవాత నైకా షేర్ ఇవాళ కూడా 5 శాతం పెరిగింది. నిన్న భారీగా క్షీణించిన బంధన్ బ్యాంక్ ఇవాళ కూడా రెడ్‌లో ఉంది. దివీస్ ల్యాబ్, లారస్ ల్యాబ్ షేర్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి.