17900 పైన నిఫ్టి
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17900ను దాటి 17925ను తాకింది. సెన్సెక్స్ మళ్ళీ 60,000 స్థాయిని దాటింది. నిఫ్టి ప్రస్తుతం 102 పాయింట్ల లాభంతో రూ. 17900 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 47 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టి బ్యాంక్ సూచీ రికార్డు స్థాయిలో 0.82 శాతం లాభపడింది. సూచీలోని అన్ని షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.75 శాతం లాభంతో ఉంది. అలాగే సిమెంట్ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ హిందాల్కో, వేదాంత, సెయిల్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. డిక్సన్ ఇవాళ కూడా 1.3 శాతం పెరిగింది.