17900పైన ప్రారంభమైన నిఫ్టి
ఓపెనింగ్‌లోనే నిఫ్టి 80 పాయింట్లకు పైగా లాభపడింది. 17932 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి ఇపుడు 58 పాయింట్ల లాభంతో 17911 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చి 17,891కి చేరినా కోలుకుంది. అయితే 17930 పైన నిఫ్టికి అధిక ఒత్తిడి ఎదురు కావొచ్చు. నిఫ్టి పెరిగినా నిఫ్టి నెక్ట్స్ నష్టాల్లో ఉంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ 0.4 శాతం లాభంతో ఉంది. ఇవాళ ఇతర సూచీలన్నా బ్యాంక్ నిఫ్టి భారీ లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టి టాప్ గెయినర్స్36 కాగా, 14 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్ సెషన్‌లోగా నిఫ్టిలో ఒత్తిడి వస్తుందేమో గమనించండి.