17800పైన నిఫ్టి
మార్కెట్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17800ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 17812 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. 45 షేర్లు లాభాల్లో ఉన్న సూచీలు ఒక మోస్తరు లాభాలకే పరిమితమయ్యాయి. నిఫ్టికి ప్రధానంగా నిఫ్టి బ్యాంక్ నుంచి మద్దతు లభిస్తోంది. టైటాన్, టాటా మోటార్స్ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ ఇవాళ కూడా నష్టంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్‌లో పెద్దగా మార్పుల్లేవ్. టాప్ గెయినర్స్‌లో టాటా పవర్, ఐడియా ఉన్నాయి.