17750పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17764ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17746 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 81 పాయింట్లు లాభపడింది. ఇక సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి మళ్ళీ 40000 స్థాయిని దాటింది. చాలా బ్యాంక్ షేర్లతో పాటు హాస్పిటల్ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 47 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో టాప్ గెయినర్ అపోలో హాస్పిటల్ కాగా, నిఫ్టి నెక్ట్స్‌లో గోద్రోజ్ కన్జూమర్ ఉంది. మిడ్ క్యాప్‌లో అస్ట్రాల్ జోరు నాన్ స్టాప్‌గా కొనసాగుతోంది. అపోలో టైర్స్‌లో బ్రేకౌట్ కన్పిస్తోంది. రిలయన్స్ రూ. 2600 దాటేందుకు సిద్ధమౌతోంది. బాటా
షేర్‌తో పాటు మెట్రో బ్రాండ్స్ వెలుగులో ఉన్నాయి.