For Money

Business News

17400పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైనా.. వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఓపెనింగ్‌లో నిఫ్టి 17468 పాయింట్లను తాకిన తరవాత 17400కు పడింది. ఇపుడు 17416 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 90 పాయింట్లు లాభపడింది. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ నిఫ్టికి అండగా నిలిచింది. మెటల్స్‌ అన్నీ ఇవాళ నష్టాలతో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.73 శాతం లాభంతో ట్రేడవుతోంది. టాటా కన్జూమర్‌ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు షేర్‌ స్పందిస్తోంది. ఐటీ దాడుల కారణంగా నిన్న భారీగా నష్టపోయిన హీరో హోండా 2 శాతం లాభంతో ప్రారంభమైంది. రుచి సోయా ఇవాళ కూడా లాభాలతో ట్రేడవుతోంది. అదానీ విల్మర్‌లో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది.