For Money

Business News

NIFTY TRADE: 17533 దాటితేనే

ఇప్పటికే ఫ్యూచర్స్‌, కాల్స్‌ కొని ఉంటే పరవాలేదని… కాని కొత్తగా పొజిషన్‌ తీసుకోవాలంటే మాత్రం నిఫ్టి 17533ని దాటితేనే తీసుకోవాలని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. ప్రస్తుతం 17500 ప్రాంతంలో కాల్‌ రైటింగ్‌ జోరుగా ఉందని, కాబట్టి తరువాతి స్థాయి కాల్ రైటింగ్‌ వచ్చే వరకు ఆగాలని ఆయన అంటున్నారు. నిఫ్టికి 17432 ప్రాంతంలో తొలి ప్రతిఘటన వచ్చే అవకాశముందని, తరువాతి ఒత్తిడి 17484 వద్ద రావొచ్చని ఆయన అంటున్నారు. 17533ని దాటితే కచ్చితంగా కొత్తగా పొజిషన్‌ తీసుకోవచ్చని నిఫ్టి 17641 దాకా వెళ్ళే అవకాశముందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నిఫ్టికి మద్దతు 17246 లేదా 17183 ప్రాంతంలో వస్తుందని వీరందర్‌ అంచనా వేస్తున్నారను. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.