17,400పైన ప్రారంభమైన నిఫ్టి
మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 17,400 వద్ద ట్రేడవుతోంది. జీ గ్రూప్ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన పలు షేర్లు లాభాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ సూచీ కూడా అందుకే పెరుగుతోంది. ఐఆర్సీటీసీ వరుసగా పెరుగుతూనే ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టి బలహీనంగా ఉంది. నిఫ్టిలో 37 షేర్లు లాభాల్లో ఉన్నా… నామ మాత్రపు లాభాలే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో.. ఓఎన్జీసీ టాప్ గెయినర్‌లో నిలిచింది. నిఫ్టికి 17425 వద్ద ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
శ్రీ సిమెంట్ 31,355.25 2.27
ఓఎన్జీసీ 126.65 2.18
టైటాన్ 2,096.40 1.98
భారతీ ఎయిర్టెల్ 700.60 0.92
హీరోమోటోకార్ప్ 2,874.75 0.81
నిఫ్టి టాప్ లూజర్స్
బీపీసీఎల్ 488.75 -0.88
యాక్సిస్ బ్యాంక్ 790.10 -0.54
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,541.80 -0.44
టెక్ మహీంద్రా 1,445.75 -0.43
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,032.30 -0.41