17300పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి లాభాల స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17331ని తాకిన నిఫ్టి ఇపుడు 17306 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 292 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్ ఏకంగా రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే బ్యాంక్ నిఫ్టి 39500ని చేరింది. నిఫ్టిలో 49 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఊహించినట్లే ఇన్ఫోసిస్ 3.65 శాతం లాభంతో నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌సీఎల్ టెక్ కూడా రెండు శాతంపైగా లాభపడింది. నిఫ్టి టాప్ 5 గెయినర్స్ ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. నిఫ్టినెక్ట్లోని 50 షేర్లూ లాభాల్లో ఉన్నాయి. జొమాటొ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలించింది. చాలా రోజుల తరవాత ఐటీ కౌంటర్లు గ్రీన్‌లో ఉన్నాయి.