For Money

Business News

ఓపెనింగ్‌లోనూ కొనొచ్చా?

మార్కెట్‌ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లకు ఇపుడు ఏం చేయాలనే సంశయమంలో ఉన్నారు. నిఫ్టిలో లాంగ్‌ పొజిషన్‌లో ఉన్నవారికి ఇవాళ మంచి లాభాలు రానున్నాయి. మరి పొజిషన్స్‌ లేనివారు ఏం చేయాలి? రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఓపెనింగ్‌లోనూ నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్. నిఫ్టినే ముందు కచ్చితంగా స్టాప్‌లాస్‌తో కొనాలని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి కొనే ఛాన్స్‌ అంటే తగ్గుతుందా అనేది అనుమానమే. అందుకే స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని అనూజ్‌ సలహా ఇస్తున్నారు. ఎందుకంటే నిఫ్టి గనుక 17325పైన అర గంట ట్రేడ్‌ అయ్యే పక్షంలో 17500 దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఒకవేళ పడినా… స్టాప్‌లాస్‌ వద్ద బయట పడొచ్చయని ఆయన చెప్పారు. ఇవాళ భారీ షార్ట్‌ కవరింగ్‌ ఉంటుందని ఆయన అంచనా. మరకొందరు అనలిస్టులు మాత్రం నిఫ్టిని అధిక స్థాయిలో లాభాలను స్వీకరించి… నిఫ్టిలో కరెక్షన్‌ వచ్చే వరకు వెయిట్‌ చేయడం మంచిదని అంటున్నారు. నిఫ్టి ఇవాళ కాకపోయినా… కొనుగోలు ఛాన్స్‌ ఇస్తుందని అంటున్నారు. అయితే నిఫ్టి ఈ ర్యాలీలో 17700ని తాకే అవకాశముందని వీరు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ ఇపుడు ఓవర్‌ సెల్‌ కారణంగా షార్ట్‌ కవరింగ్‌ వస్తోందని… ఇదే సమయంలో మార్కెట్‌ మళ్ళీ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి తొందరగా వెళ్ళే అవకాశముందని అంటున్నారు. కాబట్టి రిస్క్‌ తీసుకునేవారు ఓపెనింగ్‌లోనే స్టాప్‌లాస్‌తో పొజిషన్‌ తీసుకోవచ్చు. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి ఆరంభంలో పెద్దగా లాభపడవొద్దు. కాబట్టి బ్యాంక్‌ నిఫ్టిని ఓపెనింగ్‌ కొననడం మంచిదని అనూజ్‌ సింఘాల్ అంటున్నారు. ఇవాళ కనీసం నిఫ్టి బ్యాంక్‌ 1000 పాయింట్లు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇవాళ ఐటీ షేర్లు స్టార్‌ షేర్లుగా నిలిచే అవకాశముంది.