16,750 పైన నిఫ్టి…
కేవలం మూడు నిమిషాలు… షార్ట్ ట్రేడర్స్ సూపర్ ఓపెనింగ్. 16800 స్టాప్‌లాస్‌తో అమ్మినవారికి మూడు నిమిషాల్లో 60 పాయింట్ల లాభం. ఓపెనింగ్‌లోనే 16,782ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 16722ని తాకింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 179 పాయింట్లు పెరిగి 16,793 పాయింట్లను తాకింది. నిఫ్టికి తొలి ప్రతిఘటన ఇక్కడే ఎదురు కానుంది. ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టి 16,840 ప్రాంతానికి వెళ్ళే అవకాశముంది. మిగిలిన సూచీలన్నీ ఒక శాతంపైగా లాభపడ్డాయి. నిన్నటి పతనంతో పోలిస్తే సూచీలు సగం నష్టాలు కూడా పూడ్చుకోలేదు. మిడ్ క్యాప్ నిఫ్టి మళ్ళీ 8,000 స్థాయిని దాటింది. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్ నిలదొక్కుకునేంత వరకు వెయిట్ చేయడం మంచిది.