16000పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి లాభాలకన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్ర్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16041ని తాకిన నిఫ్టి ఇపుడు 16017 స్థాయి వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని సూచీలు అర శాతం లాభంతో ఉన్నాయి. హిందుస్థాన్ లీవర్, భారతీ ఎయిర్ టెల్ నిఫ్టి టాప్ గెయినర్స్‌గా నిలిచింది. జిందాల్ స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచింది. అదానీ గ్రూప్ షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజస్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ఇపుడు తొలి ప్రతిఘటన స్థాయిలో ఉంది. నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించాలంటే 16100 – 16200 స్థాయిని దాటాల్సి ఉంటుంది.ఆ దిశగా నిఫ్టి కదలుతుందా లేదా అన్నది చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నందున నిఫ్టి భారీగా క్షీణించే అవకాశాల్లేవు.