15900పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15927 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 15881 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 180 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌తో పాలు నిఫ్టి మిడ్ క్యాప్ షేర్ల సూచీలు నిఫ్టి కన్నా అధిక లాభంతో ఉన్నాయి. అయితే నిఫ్టి నెక్ట్స్ మాత్రం ఒక శాతం లాభానికి పరిమితమైంది. చాలా రోజుల తరవాత ఐటీ షేర్ల హవా కన్పిస్తోంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లోని అయిదు షేర్లలో ఒక్క టాటా మోటార్స్ మినహా.. అన్ని ఐటీ కంపెనీ షేర్లే. దాదాపు రెండున్నర శాతం లాభంతో టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టిలోని 50 షేర్లూ ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. అలాగే నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్స్ సూచీల్లో ఒక్క షేర్ కూడా నష్టాల్లో లేకపోవడం విశేషం. బ్యాంకు సూచీలో ఏయూ బ్యాంక్ టాప్ గెయినర్ కాగా నిఫ్టి మిడ్ క్యాప్ సెలెక్ట్‌లో పర్సిస్టెన్స్ సిస్టమ్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.