నేడు భారీ లాభాలు?
చాలా రోజుల తరవాత గిఫ్ట్ నిఫ్టి 120 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. నిఫ్టి అత్యంత కీలకమైన 24000 ట్రెండ్‌లైన్‌ను పరీక్షిస్తున్న సమయంలో… గిఫ్ట్ నిఫ్టి పాజిటివ్ సంకేతాలను ఇస్తోంది. ఏప్రిల్రెండు తరవాత అత్యంత కీలక పరీక్షను ఎదుర్కొంటోంది. నిఫ్టి ఎలాగైనా 23950 పాయింట్ల స్థాయిని కాపాడుకోవాల్సి ఉంది. ఇక్కడ నుంచి నిఫ్టి కోలుకుంటే ఓ భారీ ర్యాలీకి ఛాన్స్ ఉంది. ఇవాళ బీఎస్ఈ సెన్సెక్స్ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా. ఇవాళ గనుఖ షార్ట్ కవరింగ్ వస్తే నిఫ్టి భారీ లాభాలు గడించే అవకాశముంది. మున్ముందు ర్యాలీకి ఛాన్స్ ఉంది. ఇక మార్కెట్ వార్తల విషయానికొస్తే ఇవాళ Kfinలో భారీ బ్లాక్ డీల్‌కు ఛాన్స్ ఉంది. డీల్ సైజ్ రూ. 1400 కోట్లు. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తన వాటాను 9.9 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ నుంచి LICఅనుమతి పొందింది. దీంతో ఈ షేర్ కూడా ప్రభావితం కానుంది. కోప్సి ఆరు శాతం పైగా లాభాలతో ఉంది. ఇది మన ఐటీ షేర్లకు మైనస్‌గా మారొచ్చు. ఇక మెటల్ షేర్లలో ర్యాలీ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. డాలర్ బలహీనపడటం దీనికి ప్రధాన కారణం. నిన్న భారీగా క్షీణించిన NBFC షేర్లకు నేడు మద్దతు అందుతుందేమో చూడాలి. క్రూడ్ 92 డాలర్లపైకి చేరడంతో పలు కౌంటర్లకు నెగిటివ్ కావొచ్చు. బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్న నేపథ్యంలో క్రూడ్ క్షీణిస్తుందేమో చూడాలి.
