స్థిరంగా ప్రారంభమై నిఫ్టి
నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,951ని దాటింది. నిఫ్టి 15940ని దాటితే 20 పాయింట్ల స్టాప్ లాస్‌తో అమ్మొచ్చని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇచ్చారు. వారి అంచనాల మేరకు నిఫ్టి ఓపెనింగ్‌లో 15951ని తాకిన రతవాత 15,914నితాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 39 పాయింట్ల లాభంతో 15,924 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి గనుక మళ్ళీ ఓపెనింగ్ స్థాయి 15951ని దాటితే 15970 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఆ స్థాయి దాటితే అమ్మకాలు చేయొద్దు. ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. నిఫ్టికి బ్యాంక్ నిఫ్టి నుంచి మద్దతు అందడం లేదు. అలాగే నిన్న భారీగా పెరిగిన మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఇవాళ స్వల్ప లాభాలకే పరిమితమైంది. నిఫ్టిలో 35 షేర్లు గ్రీన్‌లో ఉన్నా…నిఫ్టిలో ఆ ఊపు కన్పించడం లేదు.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఏషియన్ పెయింట్స్ 3,039.75 2.21
పవర్ గ్రిడ్ 174.40 1.99
హెచ్డీఎఫ్సీ 2,508.35 1.88
అదానీ పోర్ట్స్ 702.80 1.56
టైటాన్ 1,792.90 1.21
నిఫ్టి టాప్ లూజర్స్
గ్రాసిం 1,549.35 -2.66
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 741.00 -0.76
బజాజ్ ఆటో 3,813.00 -0.74
ఓఎన్జీసీ 116.35 -0.64
హెచ్‌సీఎల్ టెక్ 1,031.70 -0.36