నిఫ్టి సూపర్ ఓపెనింగ్
సింగపూర్ నిఫ్టికి పూర్తి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. షార్ట్ సెల్లర్స్ పండుగ చేసుకున్నారు. 15,849 వద్ద ప్రారంభమైన నిఫ్టి నిమిషంలోనే 15,797కు చేరింది. ఇపుడు 15800 ప్రాంతంలో నిఫ్టి కొనసాగుతోంది. సో… ఉదయం అనుకున్నట్లు నిఫ్టికి 15,800పైన బలం ఉంది. కాని ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి. తొలి ప్రతిఘటన స్థాయి 15,851. నిఫ్టి అమ్మడానికి ఇదే మంచి అవకాశం. స్టాప్‌లాస్ 15,875.నిఫ్టి 15875ని దాటితే 15900ని తాకే అవకాశముంది. కాని ఇక్కడ అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. నిఫ్టిని కొనుగోలు మాత్రం చేయొద్దు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టి అరశాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ సూచీ కూడా రెడ్‌లో ఉంది. మిడ్ సెషన్‌లో నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయికి చేరే అవకాశముంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
దివీస్ ల్యాబ్ 4,865.00 0.83
సిప్లా 954.80 0.72
టాటా కన్జూమర్ 780.40 0.68
ఇన్ఫోసిస్ 1,600.50 0.63
టెక్ మహీంద్రా 1,137.65 0.59
నిఫ్టి టాప్ లూజర్స్
ఐసీఐసీఐ బ్యాంక్ 664.90 -1.74
యూపీఎల్ 809.10 -1.29
ఎస్‌బీఐ 425.10 -0.89
టాటా మోటార్స్ 293.00 -0.86
యాక్సిస్ బ్యాంక్ 750.10 -0.70