లాభాల్లోకి వచ్చిన నిఫ్టి
ఉదయం నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. పదింటికల్లా నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి 15,661ని తాకింది. ఉదయం అనుకున్నట్లు యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావడంతో… నిఫ్టి కూడా గ్రీన్‌లోకి వచ్చింది. నిఫ్టి ఇపుడు 37 పాయింట్ల లాభంతో 15789 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావడం మన మార్కెట్లకు సానుకూల సంకేతంగా మారింది.అయితే అమెరికా ఫ్యూచర్స్ అర శాతం నష్టంతో ఉన్నాయి. అయితే ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. కాబట్టి ట్రెండ్ యూరో మార్కెట్లకే పరిమితం కావొచ్చు. నిఫ్టిలో 28 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో ఇవాళ ఐటీసీ టాప్ గెయినర్ కావడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి ఈ షేర్‌ను రూ. 300 టార్గెట్‌గా చాలా మంది అనలిస్టులు సిఫారసు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై సుంకం వేయడంతో శుక్రవారం నష్టపోయిన రిలయన్స్ ఇవాళ గ్రీన్‌లో ఉంది. అయితే ఓఎన్జీసీ మాత్రం 3.62 శాతం నష్టంతో ఉంది. ఈ షేర్ శుక్రవారం 17 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. ఇక మెటల్ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగుతోంది. జొమాటోపై కొందరు ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేయడంతో ఆ షేర్ నష్టాల్లో ఉంది.