For Money

Business News

NIFTY TRADE: మళ్ళీ అదే సెటప్‌

ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. పెద్ద హెచ్చతుగ్గుల్లేవ్‌. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… ట్రెండ్‌ మైనస్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 30-40 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,355. సో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,400 ప్రాంతానికి చేరుతుందన్నమాట. ఈ స్థాయికి వస్తే కాస్సేపు ఆగండి. నిఫ్టి 17,415 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. లేదా 17,415-17,420 స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిఫ్టి గనుక 17,430ని దాటితే అమ్మొద్దు. నిఫ్టి పడితే వెంటనే క్రితం ముగింపునకు, ఆ తరవాత 17,335 స్థాయికి చేరే అవకాశముంది. ఒకవేళ నిఫ్టి గనుక 17,310-17,300 ప్రాంతానికి వస్తే 10 లేదా 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయండి. నిఫ్టి మరీ పెంచే లేదా పడగొట్టే అంశాలు ఏవీ లేదు. కాబట్టి నిఫ్టి ఒక రేంజ్‌లోనే ట్రేడ్‌ కావొచ్చు. నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషనల్‌లో ఉన్నందున భారీ లాభాలు అనుమానమే.