For Money

Business News

గ్రీన్‌లో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జాబ్‌ డేటా చాలా పాజిటివ్‌గా ఉండటంతో అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నాస్‌డాక్‌ 0.81 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.75 శాతం లాభంతో ముగిశాయి. డౌజోన్స్‌ మాత్రం 0.44 శాతం లాభాలకే పరిమితమైంది. అమెరికా మార్కెట్‌ ఉత్సాహం ఆసియాలో కన్పించడం లేదు. జపాన్‌ నిక్కీ 0.58 శాతం నష్టంతో ట్రేడవుతోంది.అలాగే హాంగ్‌సెంగ్‌ కేవలం 0.12 శాతం లాభంతో ఉంది. ఇక ఆసియా మార్కెట్లు నామమాత్రపు లాభాలతో ఉన్నాయి. ఒక్క తైవాన్‌ సూచీ మాత్రమే ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 75 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అంటే అర శాతం లాభంతో ఉందన్నమాట. ఇదే స్థాయిలో లాభాలతో నిఫ్టి ప్రారంభం కానుంది. మరి నిఫ్టి ఈ స్థాయిలో కొనసాగుతోందా, అమ్మకాల ఒత్తిడి వస్తుందా.. టెక్నికల్‌ అనాలిసిస్ ‘నిఫ్టి ట్రేడ్‌’లో చదవగలరు.