గ్రీన్‌లో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిన్న చతికిల పడిన మార్కెట్లు ఇవాళ శాంతించగా, నిన్న సెలవులో ఉన్న మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిన్న యూరో, అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ నిన్న రెండు శాతం పైగా నష్టపోగా… ఎస్ అండ్ పీ 500, డౌజోన్స్ సూచీలు రెండు శాతం దాకా నష్టపోయాయి. అధిక స్థాయిల వద్ద డాలర్ స్థిరంగా ఉంది.ఈ నేపథ్యంలో కూడా క్రూడ్ గ్రీన్‌లో ఉంది. చైనా మార్కెట్లకు ఇవాళ కూడా సెలవు. అలాగే తైవాన్‌కు కూడా. నిన్న మూడుశాతంపైగా క్షీణించిన హాంగ్‌సెంగ్ ఇవాళ స్థిరంగా ఉంది, సెలవు తరవాత ఇవాళ ప్రారంభమైన జపాన్ మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన చూస్తే నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది.