For Money

Business News

NIFTY TRADE: 17,450 లక్ష్మణరేఖ

ప్రస్తుత సంక్షోభానికి కారణమైన చైనా మార్కెట్లు సెలవులో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ స్థిరంగా ఉంది. నిన్న ప్రపంచ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం నిర్ణయం వచ్చే వరకు మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగనుంది. డాలర్‌ బలంగానే ఉంది. ఉద్దీపన ప్యాకేజీకి సాయం ఎప్పటి నుంచి తగ్గిస్తారో ఫెడరల్‌ రిజర్వ్‌ ఈసారి చెప్పనుంది. దీంతో మార్కెట్లన్నీ టెన్షన్‌లో ఉన్నాయి. ఈ టెన్షన్‌ వాతావరణంలో నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు. డాలర్‌ పెరగడం వల్ల ఐటీ కంపెనీలకు లాభమున్నా… అమెరికా నాస్‌డాక్‌ భారీగా క్షీణిస్తోంది. క్రూడ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మన మార్కెట్‌ నిలబడుతుందా అన్నది చూడాలి. సింగపూర్ నిఫ్టిని చూస్తుంటే నిఫ్టి 17,400 ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఇవాళ కూడా మెటల్స్‌లో అమ్మకాల ఒత్తిడి రానుంది. ఈ నేపథ్యంలో అసలు నిఫ్టి ఈ స్థాయికి వస్తుందా.. వస్తే నిలబడుతుందా అనేది చూడాలి. నిఫ్టి గనుక 17400పైన నిలబడితే 17,460 లేదా 17,480కి స్థాయికి చేరొచ్చు. అమ్మడానికి ఇది సరైన స్థాయి అని టెక్నికల్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. నిఫ్టిని కొనాలనుకునేవారు 17,300 వరకు ఆగాలని మరో అనలిస్ట్‌ నితేష్‌ టక్కర్‌ అంటున్నారు. తీవ్ర హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇరువైపులా ఛాన్స్‌ ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. కాబట్టి స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి.