స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
గతవారం అమెరికా మార్కట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పుల్లేవ్. అంతక్రితం యూరో మార్కెట్లు కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు గ్రీన్లో ఉండగా… జపాన్, హాంగ్సెంగ్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా జపాన్ నిక్కీ 1.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్ స్థిరంగా ఉన్నా క్రూడ్ ధరలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.