NIFTY TODAY: పడితే కొనొచ్చా!
నిఫ్టి ఇవాళ నష్టాలో ప్రారంభం కానుంది. ఇతర ఆసియా మార్కెట్లతో పోలిస్తే నిఫ్టి నష్టాలు పరిమితంగా ఉండే అవకాశముంది. చైనా కరోనా ఆంక్షల ప్రభావం మన కంపెనీలపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. శుక్రవారం హోలి హాలిడే కావడంతో ఇక ట్రేడింగ్ మూడు రోజులే ఉంది. వీక్లీ డెరివేటివ్స్ చివరి రోజు అంటే గురువారం రోజుకల్లా ఫెడ్ నిర్ణయం కూడా వచ్చేసింది. కాబట్టి డే ట్రేడర్స్ ఇవాళ్టి లెవల్స్‌ను మాత్రమే చూడండి. పొజిషనల్ ట్రేడర్స్‌కు ఈ డేటా పనికిరాదు. నిఫ్టి ఇంట్రాడే లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్
రెండో ప్రతిఘటన 16997
తొలి ప్రతిఘటన 16966
నిఫ్టికి కీలకం 16,789
తొలి మద్దతు 16776
రెండో మద్దతు 16745
డౌన్ బ్రేకౌట్ 16698
నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. టెక్నికల్స్ బై సిగ్నల్ ఇస్తున్నాయి. అధిక స్థాయిలో మాత్రం కొనుగోలు చేయొద్దు.