LEVELS: అధిక స్థాయిలో అమ్మండి
క్రూడ్ ధరలు భారీగా తగ్గినందున ఇవాళ మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18343. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18400 దరిదాపుల్లో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి ప్రధాన అవరోధం 18420 ప్రాంతంలో ఎదురు కావొచ్చు. డే ట్రేడర్స్ స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో నిఫ్టిని ఆల్గో ట్రేడర్స్ అమ్మొచ్చని సీఎన్‌బీసీ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. నిఫ్టికి 18300 లేదా 18280 ప్రాంతంలో మద్దతు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కూడా ఈ స్థాయిలో నిఫ్టిని కొనే అవకాశముంది. ఇవాళ నిఫ్టి 100 లేదా 120 పాయింట్ల వ్యత్యాసంతో ట్రేడ్ అయ్యే అవకాశముంది. బై ఆన్ డిప్స్ ఫార్ములా మార్కెట్లో పనిచేస్తోంది. ఈ నెలకు చివరి వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి.