For Money

Business News

నైకాలో ఇవాళ ర్యాలీ?

నైకా (FSN E-Commerce Ventures Limited) షేర్‌లో ఇవాళ ర్యాలీకి ఛాన్స్‌ ఉంది. ఈ కంపెనీలో యాంకర్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉన్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తయింది. కాని ఇదే సమయంలో కంపెనీ బోనస్‌ షేర్లకు రికార్డు తేదీ ఇచ్చింది. కాస్త ఆలస్యంగా ఇపుడు యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముతున్నాయి. గత వారం కొంత మంది ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను అమ్మడంతో ఈ షేర్‌ నిన్న అయిదు శాతం క్షీణించింది. నిన్న రూ. 171 కనిష్ఠ స్థాయిని ఈ షేర్‌ వెంటనే కోలుకుని రూ. 185 దాకా పెరిగింది. నిన్న రూ. 184.35 వద్ద ముగిసింది. ఇవాళ మరో యాంకర్‌ ఇన్వెస్టర్‌ టీపీజీ క్యాపిటల్‌ రూ.1000 కోట్ల విలువైన షేర్లను బ్లాక్‌డీల్‌లో అమ్మింది. సాధారణంగా ఈ స్థాయి బ్లాక్‌ డీల్‌ మార్కెట్‌ ప్రారంభమయ్యాక అవుతుంది. కొనే ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండటంతో… మార్కెట్‌ ఓపెనింగ్‌కు ముందే ఈ డీల్‌ కుదిరింది. అంటే ఓపెనింగ్‌ నుంచే ఈ షేర్‌ పెరిగే అవకాశముంది. న్యూఏజ్‌ కంపెనీల్లో లాభాల్లో ఉన్న ఏకైక లిస్టెడ్‌ కంపెనీ ఇది. కాబట్టి ఈ షేర్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగే అవకాశముంది.