NIFTY TRADE: పడితే కొనొచ్చు
అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో ఒత్తిడి కన్పిస్తోంది. డెల్టా వేరియంట్ భయం మళ్ళీ మార్కెట్లలో కనిపిస్తోంది. రాత్రి కూడా అమెరికా మార్కెట్లు తమ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి తన అప్ ట్రెండ్ కొనసాగిస్తుందా అన్న అనుమానం మార్కెట్లో వ్యక్తమౌతోంది. ఎందుకంటే ప్రధాన కంపెనీల ఫలితాలు పూర్తవుతున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 15,885. ఇక్కడి నుంచి పడితే 15840-15850 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. కాని కొనేముందుకు కొద్దిసేపు ఆగండి. ఎందుకంటే టెక్నికల్‌గా నిఫ్టి బై సిగ్నల్ 15,830 ప్రాంతంలో ఉంది. ఇక్కడ కూడా నిఫ్టి నిలదొక్కుకుంటుందేమో చూడండి. ఎందుకంటే నిఫ్టి 15800 దిగువకు వెళితే అమ్మకాల ఒత్తిడి వస్తుంది. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 15,800 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. దిగువ స్థాయిలో కొనుగోలు చేసినా స్వల్ప లాభాలకు పరిమితం అవ్వండి. ఒకవేళ నిఫ్టికి మద్దతు అందింతే 15850 దాటుతుందేమో చూడండి. ఈ స్థాయి దాటితే మాత్రం నిఫ్టి 15,925 వరకు ఒత్తిడి లేదు. ఒకవేళ నిఫ్టి లాభాలతో ప్రారంభమై ఇదే స్థాయికి వస్తే 15,940 స్టాప్‌లాస్‌తో అమ్మండి.
నిఫ్టి రేంజ్.. 15800 నుంచి 15940. కీలక స్థాయి 15,850. 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో ఈ రేంజ్లో ట్రేడ్ చేసే అవకాశం రావొచ్చు.