For Money

Business News

NIFTY TRADE: షార్ట్‌ కవరింగ్‌ వస్తుందా?

ఈ వారంలో ముఖ్యంగా సోమవారం నాటి ట్రేడింగ్‌ ధోరణి చూస్తే.. చాలా పొజిషన్స్‌ షార్ట్‌ కవరింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. సో ఇవాళ భారీ షార్ట్‌ కవరింగ్‌ ఆస్కారం తక్కువే. అయినా… దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించవచ్చని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అమెరికా మార్కెట్లకు ఇవాళ సెలవు కావడంతో చివర్లో పొజిషన్స్‌ ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఎలాంటి సంకేతాలు లేకుండానే రేపు మన మార్కెట్లు ముగుస్తుంది. ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో నికర అమ్మకాలు సాగాయి నిన్న. నిఫ్టి ఇవాళ పెరిగితే 17478 లేదా 17510 వద్ద ప్రతిఘటన ఎదురు అవుతుందని వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. సపోర్ట్‌ మాత్రం 17337, 17283 వద్ద లభిస్తుందని అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టితో ఇతర అంశాల కోసం ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=YjgjP5XzVaY