NIFTY TODAY: పడితే కొనండి
కాని ఆరంభంలోనే అమ్మే ఛాన్స్ రావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18,109. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. అంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,160ని దాటొచ్చు. నిఫ్టి తొలి ప్రతిఘటన 18,160-18,180 మధ్య రావొచ్చు. కాబట్టి రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో 18200 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిఫ్టి మళ్ళీ క్రితం స్థాయికి పడుతుందేమో చూడండి. నిఫ్టిని కొనుగోలు చేయాలనుకునేవారికి 18050 మంచి స్థాయి. మరి నిఫ్టి ఈ స్థాయికి వస్తుందా అన్నది చూడాలి. టెక్నికల్‌గా మార్కెట్‌కు బై సిగ్నల్స్ అందుతున్నాయి. కాబట్టి భారీ పతనం ఉండకపోవచ్చు. నిఫ్టికి ఇరువైపులా ఛాన్స్ ఉంది. కచ్చిత స్టాప్‌లాస్‌తో ఇరువైపులా ట్రేడ్‌కు ఆస్కారముంది.