NIFTY TODAY: పెరిగితే అమ్మండి
నిన్న కేవలం హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌లో వచ్చిన షార్ట్ కవరింగ్ నిఫ్టి గ్రీన్‌లో ముగిసింది. కాని స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో రక్తపాతమే జరిగింది. ఈ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని షేర్లు పది శాతం కన్నా ఎక్కువగా నష్టపోయాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల పోర్టు ఫోలియోలో భారీగా కోత పడుతోంది. దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందుతున్నా… పై స్థాయిలో ఒత్తిడి ఉంటోంది. డే ట్రేడర్స్‌కు ఇలాంటి స్థితి మంచి లాభాలను ఇస్తోంది. ఇవాళ కూడా నిఫ్టికి 15280-15260 మధ్య మద్దతు లభించే అవకాశముంది. లాభాల్లో ప్రారంభమైతే తొలి మద్దతు 15400 ప్రాంతంలో ఉంటుంది. ఇక ఇవాళ్టికి
నిఫ్టి లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్ – 15471
రెండో ప్రతిఘటన – 15439
తొలి ప్రతిఘటన – 15418
నిఫ్టికి కీలకం – 15308
తొలి మద్దతు – 15282
రెండో మద్దతు – 15261
డౌన్ బ్రేకౌట్ – 15229