For Money

Business News

NIFTY LEVELS: 17500 కీలకం

మార్కెట్‌ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17655. సింగపూర్ నిఫ్టి 200 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈలెక్కన నిఫ్టి 17455 వద్ద ప్రారంభం కావాలి. కాని నిఫ్టి ఆ స్థాయిలో కాకున్నా…17540 – 17500 మధ్య నిఫ్టి ప్రారంభం కావొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టి గనుక ఇదే ప్రాంతంలో ప్రారంభమైతే 17481 వద్ద తొలి మద్దతు లేదా 17449 వద్ద రెండో మద్దతు లభించే అవకాశముందని ప్రముఖ డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంచనా వేస్తున్నారు. నిఫ్టి 17540పైన ముగియాల్సి ఉంది. లేకుంటే మార్కెట్‌ మరింత పతనం చూడాల్సి ఉంటుంది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించే పక్షంలో ముఖ్యంగా 17590 ప్రాంతానికి వస్తే మరింత మద్దతు లభించే అవకాశముంది.