17076 వద్ద నిఫ్టికి మద్దతు
నిఫ్టి ఇవాళ ఉదయం తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆరంభంలో 17200పైన ఉన్నా… ఆ స్థాయిలో ఎక్కవ సేపు ఉండలేదు. నిఫ్టి 17098ని తాకిన నిఫ్టి ఇపుడు 17144 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్ సెషన్ లేదా అంతకుముందు నిఫ్టి 17076ని తాకే అవకాశాలు ఉన్నాయని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఈ స్థాయికి దిగువకు వెళ్ళినా వెంటనే 17040 వద్ద మరో మద్దతు ఉంది. 17000 స్థాయిని కోల్పోతే అంటే 16984 దిగువకు వెళితే డౌన్ బ్రేకౌట్ ప్రారంభమైనట్లు చెప్పొచ్చు. కాని నిఫ్టి ఇవాళ ఆ స్థాయికి చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నిఫ్టికి 17076 వద్ద మద్దతు లభిస్తే 17183 దాకా వెళ్ళే అవకాశముంది. ఈ స్థాయి వద్ద నిఫ్టి గనుక నిలదొక్కుకుంటే కచ్చితం 17295ని తాకే అవకాశముందని, అయితే ఆ స్థాయిలోగానే నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. కాబట్టి నిఫ్టి లెవల్స్‌ను చూసి స్టాప్‌లాస్‌తో ట్రేడ్ చేయాలని అనలిస్టులు అంటున్నారు.