For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే స్వల్ప లాభాల్లోకి వెళ్ళి 17201ని తాకింది. అయితే వెంటనే 17132ను కూడా తాకింది. ఇపుడు 17148 వద్ద 37 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. పైకి నిఫ్టి స్థిరంగా ఉన్నట్లు కన్పించినా.. చాలా వరకు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ ఒక్కటే గ్రీన్‌లో ఉంది. మిగిలిన ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో కూడా 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే బజాజ్‌ ఆటో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మెటల్స్‌లో స్పల్ప ఒత్తిడి కన్పిస్తోంది. బ్యాంక్‌ షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ స్వల్ప లాభాలతో టాప్‌ గెయినర్‌లో ఉంది. ఇన్ఫోసిస్‌ కూడా గ్రీన్‌లో ఉంది. కాని లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా 37 షేర్లు నష్టాల్లో 12 షేర్ల లాభాల్లో ఉన్నాయి. శ్రీమెంట్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. దీంతో షేర్‌ 4 శాతంపైగా నష్టపోయింది. అలాగే వేదాంత రెండు శాతంపైగా నష్టపోయింది. పిడిలైట్‌ ఒకటిన్నర శాతంతోంది. ఈ షేర్‌ నిఫ్టిలోకి చేరుతుందనే వార్తలు మార్కెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో లారస్‌ ల్యాబ్‌ ఒక శాతం లాభంతో ఉంది.