16200 వద్ద మద్దతుకు అవకాశం
నిఫ్టికి 16200 ప్రాంతంలో మద్దతు అందే అవకాశం ఉందని డైరెక్టర్ ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ సుమీత్ బగాడియా అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 15800 ప్రాంతంలో తదుపరి మద్దతు ఉందని వెల్లడించారు. ఒకవేళ నిఫ్టి పుంజుకుంటే వెంటనే 16900 లేదా 17000 ప్రాంతంలో ప్రతిఘటన ఉంటుందని అన్నారు. ఇంతకుమునుపు బుల్ రన్ 15671 నుంఇ 18115 దాకా సాగింది. ఈ పెరుగదలలో ఇప్పటికే 61.8 శాతం నిఫ్టికోల్పోయిందని ఆయన అన్నానరు. ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఆయన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. వీక్లీ చార్ట్స్‌లో బేరిష్ క్యాండిల్ ప్యాటర్న్ ఏర్పడిందని…అమ్మకాల ఒత్తిడి అధికాంగా ఉందని అన్నారు. హెడ్ అండ్ షోల్డ్స్ ప్యాటర్న్ నెక్‌లైన్‌కు దిగువన నిఫ్టి ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 16200 స్థాయిని నిఫ్టి కోల్పోతే.. మార్కెట్ విషయంలో మనం దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. వీక్లీ చార్ట్స్‌లో సాంకేతికంగా ఇండియా విక్స్ (VIX) 21.25 వద్ద ఉందని.. లాంగ్ బేరిష్ క్యాండిల్ ఏర్పడిందని.. దీనర్థం మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ నుంచి నెగిటివ్‌లోకి మారినట్లేనని సుమీత్ బగాడియా పేర్కొన్నారు.