NIFTY TRADE: పెరిగితే అమ్మడమే
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. క్యాష్ మార్కెట్లో భారీగా అమ్ముతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌లో కాల్ రైటింగ్ అంతంత మాత్రమే ఉంది. పుట్ రైటింగ్ అస్సలేదు. అంటే మార్కెట్ పతనం ఎక్కడిదాకా అన్న విషయంలో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి క్లూ లేదు. షార్ట్ కవరింగ్ వస్తుందా? వస్తే విదేశీ ఇన్వెస్టర్లు పాల్గొంటారా అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో నిఫ్టి పెరిగినపుడల్లా అమ్మడమే బెటర్ అని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. 16,060పైన నిఫ్టి బలంగా ఉన్నపుడే షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ్టికి వీరేందర్ లెవల్స్… ఎగువన 15,983 లేదా 16,060 మధ్య రిసెస్టెన్స్ జోన్. ఈ స్థాయిని దాటితే 16,178 నుంచి 16,258 వరకు వెళ్ళే ఛాన్స్. పడితే దిగువన 15,706 లేదా 15,646 ప్రాంతంలో మద్దతు వచ్చే అవకాశముంది. లేదంటే నిఫ్టి 15,590 లేదా 15,540ని తాకే అవకావముందని ఆయన అంటున్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్, ఇతర సమాచారం కోసం వీడియో చూడండి.