For Money

Business News

నష్టాలతో ప్రారంభమైనా…

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే వంద పాయింట్ల నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15,747 పాయింట్లకు తగ్గిన నిఫ్టి వెంటనే కోలుకుని 15,828 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టిలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి. బ్యాంక్‌ నిఫ్టితో పాటు నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌క్యాప్‌ నిఫ్టి మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 24 షేర్లు నష్టాల్లో ఉండగా, 26 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు ఇంకా పెరుగుతున్నందున… ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నాట్కో లాభాల్లో ఉంది. అలాగే చక్కెర షేర్లు కూడా. మరి నిఫ్టి అధిక స్థాయిలో నిలబడుతుందా అనేది చూడాలి. మరోవైపు ఆసియా మార్కెట్లలో నష్టాలు పెరిగాయి. నామ మాత్రపు నష్టాల్లో ఉన్న సూచీలన్నీ ఇపుడు ఒక శాతంపైగా నష్టాల్లో ఉన్నాయి.