NIFTY TODAY: 17150 లక్ష్మణ రేఖ
సింపుల్. 17,150 ప్రాంతంలోకి నిఫ్టి వస్తే అమ్మండి. రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లు 17135 ప్రాంతంలోనే నిఫ్టిని అమ్మొచ్చు. చాలా వరకు యూరోప్, అమెరికా మార్కెట్లకు సెలవు కాబట్టి… మిడ్ సెషన్ లోపలే నిఫ్టిలో స్వల్ప ఒత్తిడి రావొచ్చు. నిఫ్టిలో భారీ అమ్మకాలు లేకున్నా… ఓపెనింగ్‌లోనే ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం అవుతుంది కాబట్టి… అమ్మడం వినా మరో మార్గం లేదు. నిఫ్టి క్రితం ముగింపు 17,072. ఇవాళ ఓపెనింగ్‌లోనే 17,100 స్థాయిని దాటనుంది. తొలి ప్రతిఘటన 17150 ప్రాంతంలో రావొచ్చు. ఆ స్థాయిని దాటితే 17180. ఈ స్థాయిని స్టాప్‌లాస్‌తో పెట్టుకుని అమ్మొచ్చు. ఈ స్థాయి పైన నిఫ్టికి మద్దతు ఉంది. అయితే నిఫ్టి 100 పాయింట్లకు మించి పెరగకపోవచ్చు. పై స్థాయిలో మాత్రం కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే నిఫ్టి 17000 ప్రాంతంలో మద్దతు ఉంది.ఈ స్థాయి దిగువకు వస్తే 16,966 దాకా పడిపోయే అవకాశముంది.