For Money

Business News

NIFTY TRADE: 16711 గమనించండి

నిఫ్టికి సంబంధించి సీఎన్‌బీసీ ఆవాజ్‌ అనలిస్ట్‌ నీరజ్‌ కుమార్‌ వ్యూహం భిన్నంగా ఉంది. నిఫ్టి 16,660 లేదా 16711 ప్రాంతంలో నిఫ్టికి ఒత్తిడి రావొచ్చని ఆయన అంటున్నారు. ఈ రెండు స్థాయిలను దాటితే 16864 దాకా నిఫ్టి వెళ్ళే అవకాశముందని ఆయన అంటున్నారు. ఇక నిఫ్టి పడేపక్షంలో తొలి మద్దతు 16473 లేదా 16403 ప్రాంతంలో ఉంటుందని ఆయన అంటున్నారు. నిఫ్టి 200 రోజలు ఎక్స్‌పొనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ 16354 -16287 మధ్య ఉందని నీరజ్‌ అంటున్నారు. నిఫ్టి లాంగ్‌ పొజిషన్‌ తీసుకోవడానికి ఇప్పటికీ ఇన్వెస్టర్లు జంకుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు రోజూ అమ్ముతున్నారు. నిన్న క్యాష్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా ఉన్నారు. నిన్న వీటి నికర అమ్మకాల విలువ రూ.3565 కోట్లు. ఫ్యూచర్స్‌లో వీరు రూ. 1163 కోట్లు అమ్మారు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=cW49XJ0vZNE