NIFTY TRADE: పెరిగితే అమ్మండి.. కానీ
ఇవాళ్టి నుంచి నవంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభం కానుంది. నిఫ్టి నిన్న భారీగా క్షీణించింది. కొత్త సిరీస్ ప్రారంభం కావడం, మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ఉండటం. స్వల్పంగా క్షీణించిన క్రూడ్….ఇవి పాజిటివ్ అంశాలు. కాని నెగిటివ్ అంశాలు అధికంగా ఉన్నాయి. కార్పొరేట్ ఫలితాలు నిరుత్సాహంగా ఉన్నాయి. ఆసియా డౌన్, నిన్న యూరప్ డౌన్. రాత్రి అమెరికా పెరిగినా..ఇవాళ నష్టాలు తప్పవు. కారణంగా యాపిల్, అమెజాన్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడం. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ వ్యూహం విషయానికి వస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17857. నిఫ్టి నష్టాల్లో ప్రారంభమైతే… తొలి మద్దతు 17795, 17744, 17690 స్థాయిలను గమనించండి. ఒకవేళ నిఫ్టికి మద్దతు లభిస్తే తొలి ప్రతిఘటన 17,920. ఈ స్థాయిని దాటితే 17970, 18025 స్థాయిలను గమనించండి. నిఫ్టి పడితే భారీ నష్టాలు ఉండకపోవచ్చు. దీనికి కారణం నిఫ్టి ఇప్పటికే ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. అక్కడి నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తోంది. రిస్క్ తీసుకునే వారు దిగువస్థాయిలో కొనుగోలు చేయొచ్చు. కాని స్ట్రిక్ట్ స్టాప్లాస్తోనే కొనండి. ఎందుకంటే నిఫ్టి 17,500 దిగువకు వెళుతుందని అనలిస్టలు హెచ్చరిస్తున్నారు. ఎపుడు వెళుతుందనే అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నా… చాలా మంది అనలిస్టులు నిఫ్టి క్షీణిస్తుందనే అంటున్నారు. కాబట్టి పెరిగినా, పడినా స్వల్ప లాభాలతో బయటపడండి.